Header Banner

పోలీస్ విభాగంలో భారీ మార్పులు.. జిల్లాకు ఒక సైబర్ క్రైం పోలీస్ స్టేషన్! హోం మంత్రి కీలక ప్రకటన!

  Sat Apr 19, 2025 17:15        Politics

కొత్తగా పది పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి.. జిల్లాకు ఒక సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం అన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. గుంటూరు రేంజ్ పరిధిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు హోంమంత్రి.. గుంటూరు, రాజధాని అమరావతి, హైకోర్టు, పొలిటికల్ పార్టీల ఆఫీసులు ఈ ప్రాంతంలో ఉన్నాయని.. పల్నాడులో ఫ్యాక్షన్ కొన్నిచోట్ల ఉంది.. నలభై గ్రామాల్లో ఫ్యాక్షన్ కనిపిస్తుందన్నారు.. ఇక, సైబర్ క్రైం ప్రకాశం జిల్లాలో జీరో వెల్లడించారు అనిత.. గుంటూరు జిల్లాలో అనేక కేసుల్లో రికవరీ బాగుందన్న ఆమె.. పోలీసుల భద్రత చూడాల్సిన అవసరం ఉంది. గుంటూరు జిల్లాలో పోలీసులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

ఇక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై పోక్సో కేసుల్లో శిక్షలు పడ్డాయని తెలిపారు హోం మంత్రి అనిత.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 కోట్లు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పబ్లిక్, ప్రైవేట్ ప్లేసులలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను కోరారు.. మరోవైపు, బాపట్ల సముద్రతీరప్రాంతంలో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నాం. ప్రజల రక్షణే భద్రతగా పోలీసులు పనిచేస్తున్నారు. కొత్తగా పది పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. జిల్లాకు ఒక సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం అన్నారు.. ప్రమోషన్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటిపై దృష్టి పెడతామన్నారు.. గత ఐదేళ్లలో పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..

ఇది కూడా చదవండిబీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


విజయసాయి రెడ్డికి బదులుగా కొత్త ఫైర్ బ్రాండ్! బీజేపీ నుండి ఆయన ఎంట్రీ!


జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి! నాస్తికుడిని తితిదే ఛైర్మన్ గా..


మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!


టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #CyberCrime #PoliceReforms #APHomeMinister #GunturUpdates #LawAndOrder #APPolice